40 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

الاثنين، 1 نوفمبر 2021

40 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ elecric sctoor science technologe ఓకాయా పవర్ గ్రూప్

t f B! P L

 


రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాముఖ్యత పెరిగింది. దీంతో కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు విడుదల కాగా, మరికొన్ని వాహనాలు విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రముఖ ఓకాయా పవర్‌ గ్రూప్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందిస్తోంది. కేవలం 39,999 రూపాలయ ధరతో ఓకాయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో విడుదలైంది. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఓకాయా కంపెనీ దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 165 మంది డీలర్లను నియమించుకుంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ హర్యానాలోను, రాజస్థాన్‌లోని నీమ్రానాలో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కూటర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల నవరాత్రి పండుగ సందర్భంగా ఈ స్కూటర్‌ను ప్రారంభించారు. కాగా వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని ఓకాయా చెబుతోంది. దీంతో భారత్‌లో పూర్తి స్థాయిలో విస్తరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపింది. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ స్కూటర్‌ను నడిపేందుకు ఎటువంటి లైసెన్సు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకాయా పవర్ గ్రూప్ 4 దశాబ్దాలుగా భారతదేశంలో బ్యాటరీ తయారీ రంగంలో నమ్మకానికి, నాణ్యతకు మంచి పేరుగా ఉంది. అలాగే దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ