ఆన్​లైన్​లోనే జీవన్​​ ప్రమాణ్ సర్టిఫికెట్ సబ్​మిట్ చేయెచ్చు!

الأربعاء، 27 أكتوبر 2021

andhrapradesh life certificate national online pension technologe telangana ఆన్​లైన్​లో జీవన్​​ ప్రమాణ్ సర్టిఫికెట్ సబ్​మిట్

t f B! P L

 

ప్రతియేటా పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ డాక్యుమెంట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. ప్రతినెలా పెన్షన్‌ను పొందాలంటే ఈ ధ్రువపత్రాన్ని సబ్మిట్ చేయడం తప్పనిసరి కాగా ఈ ఏడాది పింఛనుదారులు తమ జీవన్ ప్రమాణ్‌ను నవంబర్ 30 లోపు సమర్పించాలి. ఈ మేరకు వృద్ధులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లలో కూడా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. వృద్ధులు కార్యాలయాలకు వెళ్లి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని రూపొందించుకుని సబ్మిట్ చేయడం చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుత కరోనా కాలంలో బయటికి రావడం వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే ప్రమాణపత్రం జనరేట్ చేసుకొని సమర్పించడానికి వీలు కల్పిస్తోంది. సురక్షితమైన ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికెట్ రూపొందించవచ్చు. తర్వాత పెన్షన్ మంజూరు చేసే సంస్థలు తమకు కావాల్సినప్పుడు వాటిని యాక్సెస్ చేయగలవు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌ స్టోర్ అవుతుంది. పెన్షనర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్ కలిగి ఉండాలి. ఆన్‌లైన్ సర్టిఫికేట్‌ను రూపొందించాలనుకునే పెన్షనర్ తప్పనిసరిగా వర్కింగ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. అన్నిటికంటే ముందుగా పెన్షనర్ ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

పెన్షనర్ ముందుగా అధికారిక వెబ్ సైట్లో జీవన్ ప్రమాణ్  సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత పెన్షనర్ తన ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సమర్పించాలి. సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక ఆ నంబర్‌ను కాపీ చేసి నమోదు చేయాలి. తరువాత ప్రమాణ్ ఐడీ   జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ప్రమాణ్ ఐడీ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు పై స్టెప్స్ ఫాలో కాకుండా నేరుగా యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు. ఇందుకు ఒకసారి ఓటీపీ ధృవీకరిస్తే సరిపోతుంది. లాగిన్ అయ్యాక 'జనరేట్ జీవన్ ప్రమాణ్' ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్, మొబైల్ నంబర్‌లను నమోదు చేయాలి. ఇప్పుడు జనరేట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేసి దానిని నమోదు చేయాలి. పీపీఓ నంబర్, పేరు, పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీ పేరును నమోదు చేయాలి. ఆధార్ డేటాను ఉపయోగించి, పెన్షనర్ వేలిముద్ర, కనుపాపలు(ఐరిష్)ను స్కాన్ ద్వారా స్వయం ధ్రువీకరణ చేయాలి. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత జీవన్ ప్రమాణ్ ప్రింట్ కాపీ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దాని డిజిటల్ ప్రింట్ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లైఫ్ సర్టిఫికెట్ కాపీ కనిపించిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే, ఇక లైఫ్ సర్టిఫికెట్ విజయవంతంగా జనరేట్ చేసి సబ్మిట్ చేసినట్లవుతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ