కడప నగరంలోని నకాశ్ వీధిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. కూతురు అధిక సమయం మొబైల్ చూస్తుందని తల్లి మందలించింది. ఈ క్రమంలో తల్లి ఖుర్షీదా, కూతురు హలీం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన తల్లి.. కూతురు మెడకు చున్నీ బిగించి హత్యకు పాల్పడింది. చెల్లెలు హత్యను చూసి తట్టుకోలేక ఆమె కుమారుడు జమీర్ కోపంతో తల్లి ఖుర్షీదాను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق