పోటీ నుంచి తప్పుకుంటున్నా: సీవీఎల్‌ నరసింహారావు

السبت، 2 أكتوبر 2021

: సీవీఎల్‌ cinema elections MAA narasimharao పోటీ నుంచి తప్పుకుంటున్నా

t f B! P L

 


‘మా’ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహారావు చివరి నిమిషంలో తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని వివరాలు రెండ్రోజుల్లో మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. అధ్యక్ష పదవి కంటే తనకి ‘మా’ సభ్యుల సంక్షేమమే ముఖ్యమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న రెండు ప్యానళ్లలో తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ‘‘నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశా. ఇప్పుడు ఆ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నా. ఉదయమే నా మ్యానిఫెస్టోను ప్రకటించాను. నేను నామినేషన్ ఉపసంహరించడానికి ప్రత్యేక కారణం ఉంది. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా చెబుతా. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ నేను మద్దతు ఇవ్వటం లేదు.  విజయశాంతి గారు ట్విటర్‌ వేదికగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ఎన్నికల ల్లో ఎవరు గెలిచిన మా సంక్షేమం కోసం పని చేయాలి’’ అని అన్నారు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులతోపాటు అధ్యక్ష పదవికి సీవీఎల్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల నామినేషన్‌ దాఖలు చేసి ఈ ఉదయమే తన మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ