సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ త్వరలో ఓ కూల్‌ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చర్చ అటు ఇటు తిరిగి వాదులాటకు దారితీసే క్రమంలో ట్విటర్‌.. సదరు ట్వీపుల్స్‌(ట్విటర్‌ పీపుల్స్‌)ను అప్రమత్తం చేస్తుందట. ఇందుకోసం యూజర్ల సంభాషణ మధ్యలో కింద ఆఫ్షన్స్‌తో ఓ ఫీచర్‌ను డిస్‌ప్లే చేయబోతోంది. అప్పుడు యూజర్లు విచక్షణతో స్పందిస్తే.. ఆ ట్వీట్‌-రీట్వీట్ల సంభాషణపర్వం వేడెక్కకుండా అక్కడితోనే చల్లబడే ఛాన్స్‌ ఉంటుంది. సంభాషణకు సంబంధించి ఏ సందర్భంలో అలర్ట్‌ చేస్తుంది, అసలు ఎలా అంచనా వేయగలుగుతందనేది, ఎలా పని చేస్తుందనే విషయాల్ని ట్విటర్‌ ఇప్పుడే చెప్పట్లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందట. ఇది పూర్తయ్యాక ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌.. రెండింటిలోనూ ఈ కూల్‌ ఫీచర్‌ను అప్‌డేట్‌ ద్వారా తీసుకురాబోతున్నారు.  ఈమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విటర్‌ టైం లైన్‌లో వాటికవే రిఫ్రెష్‌ అయ్యి.. ట్వీట్లు కనిపించకుండా పోతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్‌ ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా ఓ ఫీచర్‌ను తెస్తామని హామీ ఇచ్చింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ