30 రోజుల పాటు కార్గో లైసెన్స్ ను సస్పెండ్

السبت، 16 أكتوبر 2021

30 రోజుల పాటు కార్గో లైసెన్స్ ను సస్పెండ్ jetairlines డీజీసీఏ దేశీయ విదేశీ విమానాలను

t f B! P L


భారత్​లో విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్సైస్ జెట్‌కు ఝలక్ ఇచ్చింది. స్పైస్​ జెట్​ కార్గో లైసెన్స్​ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది. మొత్తం 30 రోజుల పాటు లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది డీజీసీఏ. లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్​ను అనుమతించరు. దేశీయ, విదేశీ విమానాలను ఇందుకు అనుమతించబోమని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వార్షిక ఏడాదిలో రూ.30 కోట్ల లాభాన్ని కార్గో రవాణా ద్వారా సాధించింది స్పైస్​ జెట్​ సంస్థ. మరోవైపు డీజీసీఏకు స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ఓ రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ఆ షిప్పర్​ను బ్లాక్​ లిస్ట్​లో చేర్చినట్లు స్పైస్​ జెట్​ తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ