నేను బతికే ఉన్నాను

Sunday, August 8, 2021

cinema sharada socialmedia నేను బతికే ఉన్నాను

t f B! P L

 


అలనాటి దిగ్గజ నటి, ఊర్వశి శారద కన్నుమూశారంటూ ఆదివారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు, ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఆ వార్తలు నిజమా? కాదా? అన్న దానిపై స్పష్టత కోసం వేచి చూశారు. విషయం తెలుసుకున్న శారద సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు.
‘నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఒంట్లో కాస్త నలతగా ఉంది. దయచేసి వాట్సాప్‌లలో వచ్చే వాటిని నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’ అని పేర్కొన్నారు. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయిక, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శారద తనదైన ముద్రవేశారు. ఆమె మూడుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 76 సంవత్సరాలు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ