Ad Code

ఐఆర్‌సీటీసీ బిజినెస్ ఆఫర్

 

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్  ఓ మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ బుకింగ్ ఏజెంట్‌గా నెలకు రూ.80,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది. మీరు ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ ఏజెంట్‌గా ఉంటూ నెలకు రూ.80,000 వరకు సులువుగా సంపాదించొచ్చు. ఐఆర్‌సీటీసీ అందించే సేవల్ని మీరు ప్రయాణికులకు చేరవేస్తూ డబ్బు సంపాదించొచ్చు. ప్రస్తుతం 55 శాతం మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేస్తున్నారు. వారిలో సొంతగా మొబైల్ ద్వారా టికెట్లు బుక్ చేస్తుంటే, మిగతా వారు ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్స్ బుక్ చేస్తున్నారు. మీరు ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ ఏజెంట్‌గా మారితే మీరూ ప్రయాణికుల తరఫున టికెట్లు బుక్ చేసి కమిషన్ పొందొచ్చు. ప్రతీ టికెట్ బుకింగ్‌కు కమిషన్ ఉంటుంది.

ఐఆర్సీటీసీ ఏజెంట్ నాన్ ఏసీ క్లాస్ టికెట్ ఒకటి బుక్ చేస్తే రూ.20 కమిషన్ లభిస్తుంది. ఏసీ క్లాస్ టికెట్ బుక్ చేస్తే రూ.40 కమిషన్ పొందొచ్చు. ప్రతీ రూ.2,000 ట్రాన్సాక్షన్‌కు అదనంగా 1 శాతం కమిషన్ వస్తుంది. రూ.2,000 కన్నా ఎక్కువ జరిపే లావాదేవీలకు 0.75% కమిషన్ లభిస్తుంది. ఐఆర్‌సీటీసీ ఏజెంట్ నెలకు ఎన్ని రైలు టికెట్ల్ అయినా బుక్ చేయొచ్చు. లిమిట్ ఉండదు. ప్రతీ బుకింగ్‌కు, లావాదేవీకి కమిషన్ పొందొచ్చు. ఇలా నెలకు రూ.80,000 వరకు సంపాదించొచ్చు. రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో కూడా నెలకు రూ.40,000 పైనే సంపాదించొచ్చు.

ఐఆర్‌సీటీసీ ఏజెంట్ అన్‌లిమిటెడ్ టికెట్ బుకింగ్ చేయొచ్చు. బల్క్‌గా టికెట్లు బుక్ చేసే అవకాశం కూడా ఉంది. జనరల్ పబ్లిక్ బుకింగ్ ఓపెన్ అయిన 15 నిమిషాల్లో తత్కాల్ టికెట్లు బుక్ చేయొచ్చు. క్యాన్సలేషన్ ప్రాసెస్ కూడా సులువుగానే ఉంటుంది. రైలు టికెట్లు మాత్రమే కాదు... ఎయిర్, బస్ టికెట్లు, హోటల్ బుకింగ్, హాలిడే ప్యాకేజీ బుకింగ్, ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయచ్చు. ఐఆర్‌సీటీసీ ఏజెంట్ కావాలంటే ఏజెన్సీ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.3,999, రెండేళ్లకు రూ.6,999 చెల్లించాలి. ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ వెబ్ సర్వీస్, ఐఆర్‌సీటీసీ ఏజెంట్ లైసెన్స్ లభిస్తుంది. 100 టికెట్లు బుక్ చేస్తే ప్రతీ టికెట్‌కు రూ.10 చొప్పున ఛార్జీ ఉంటుంది. 101 నుంచి 300 టికెట్లకు ప్రతీ టికెట్‌కు రూ.8, నెలకు 300 టికెట్ల పైన బుక్ చేస్తే టికెట్‌కు రూ.5 చొప్పున ఛార్జీ ఉంటుంది. మరిన్ని వివరాలు https://www.irctc.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu