ホーム
/
బంపర్ ఆఫర్
/
కిరాణా వర్తకులకు బంపర్ ఆఫర్
الأربعاء، 25 أغسطس 2021
business flipkart muper offer retail కిరాణా వర్తకులకు బంపర్ ఆఫర్
కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ నూతనంగా ఒక 'క్రెడిట్ ప్రోగ్రామ్'ను ప్రకటించింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది.
ليست هناك تعليقات:
إرسال تعليق