చైనా దోస్తీ లిథియం కోసమేనా?

الأحد، 22 أغسطس 2021

afghan america china science technologe చైనా దోస్తీ లిథియం కోసమేనా

t f B! P L


తాలిబన్లు తమతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చైనా ఒక ప్రకటనలో పేర్కొంది. అఫ్గనిస్తాన్‌ పునర్నిర్మాణానికి తమ వంతు సహాయం అందిస్తామని డ్రాగన్‌ దేశం వెల్లడించింది.  అఫ్గనిస్తాన్‌ను సొంతం చేసుకున్న తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన ఐదో ఉగ్రవాద సంస్థ అని అమెరికా వెల్లడించింది. తాలిబన్ల రాకతో ఇప్పటికే అఫ్గనిస్తాన్‌లోని ప్రపంచంలో అత్యధిక లిథియం ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను అఫ్గనిస్తాన్‌ తమ అధీనంలోకి తీసుకుంది. ఇంతవరకు వెలికితీయని ఖనిజాలు అఫ్గనిస్తాన్‌లో ఉన్నాయి వీటి విలువ సుమారు ఒక ట్రిలియన్‌ డాలర్లకు ఉండనుంది. ఈ ఖనిజాలు పునరుత్పాదక శక్తిగా మార్చే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం బాక్సెట్‌, రాగి, ఇనుప ఖనిజం, వంటి అరుదైన నిక్షేపాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది. విద్యుత్‌ కేబుల్స్‌ తయారుచేయడానికి రాగి వంటి లోహల ధర ప్రపంచ మార్కెట్‌లో భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా నిష్క్రమించడంతో చైనా కు మార్గం సులువైంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా తాలిబన్లతో స్నేహం చేయడానికి సిద్ధంకావడంతో వారి మైత్రి ప్రపంచదేశాలపైనా భారీ ప్రభావం ఉంటుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుష్కలమైన ఖనిజ సంపదను కలిగి ఉన్న అఫ్గనిస్తాన్‌ దేశం చైనాకు ఎల్‌డోరాడ్‌గా మారనుందని ఫ్రెంచ్‌ నిపుణుడు పిట్రాన్‌ హెచ్చరించాడు. దీంతో చైనా ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లను శాసించడానికి భారీ పన్నాగమే పన్నిందని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ పెరుగుతున్న తరుణంలో ప్రపంచ దేశాలు పునరుత్పాదకత శక్తిపై అడుగులు వేస్తున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లో ఉపయోగించే అరుదైన నియోడైమియం, ప్రెసోడైమియం, డైస్ప్రోసియం వంటి ఖనిజాలు అఫ్గన్‌ సొంతం. ఎలక్ట్రిక్‌ కార్‌ బ్యాటరీలు, సోలార్‌ ప్యానెల్‌, విండ్‌ఫామ్‌లను తయారుచేయడానికి లిథియం కీలకమైన అంశం. అంతర్జాతీయ ఇంధన సంస్ధ ప్రకారం లిథియంకు ప్రపంచ వ్యాప్తంగా 2040 నాటికి 40 రెట్ల మేర డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ