10 నిమిషాల్లో హోమ్ డెలివరీ

Wednesday, August 18, 2021

10 minits business home

t f B! P L

 


ప్రముఖ గ్రోసరీ డెలివరీ సర్వీస్ సంస్థ గ్రోఫర్స్ భారత్​లో తన సేవలను విస్తరిస్తోంది. ఇతర సంస్థలకు దీటుగా నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త సేవలను ప్రారంభించింది. కిరాణ సరుకుల డెలివరీ సమయాన్ని 15 నుంచి 10 నిమిషాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా గ్రోఫర్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్బిందర్ దిండ్సా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో తమ సేవలను విస్తరించామని చెప్పారు. కస్టమర్​ సరుకులు బుక్​ చేసుకున్న తరువాత.. కేవలం 10 నిమిషాల్లోనే కిరాణ సామాగ్రిని అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 'ప్రస్తుతం మా సగటు డెలివరీ సమయం 15 నిమిషాలుగా ఉంది. దాన్ని 10 నిమిషాలకు తగ్గిస్తున్నాం. భారతదేశంలోని ప్రతి కస్టమర్‌కు 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే కిరాణా సరుకులు డెలివరీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో మరిన్ని నగరాలకు సేవలను విస్తరిస్తాం' అని అల్బిందర్ వెల్లడించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ