ホーム
/
top mileage
/
మైలేజీనిచ్చే టాప్ కార్లు!
الاثنين، 19 يوليو 2021
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 గా వుంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వాటిలో పెట్రోల్ ఇంజన్ తోపాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)తో నడిచే కార్లనే ఎక్కువగా కొనేందుకు వినియోగదారులు ఇష్టపడుతున్నారు. సీఎన్‌జీ ఇంధనం తక్కువ ధరకు లభించడమే కాకుండా, పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే అధిక మైలేజీ కూడా ఇస్తాయి. సీఎన్‌జీతో నడిచే కొన్ని కార్లు : మారుతి సుజుకీ వ్యాగన్ఆర్, మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో, మారుతి సుజుకీ సెలెరియో, హ్యుందాయ్ శాంత్రో, మారుతి సుజుకీ ఆల్టో 800.
ليست هناك تعليقات:
إرسال تعليق