ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్మీ అంబులెన్స్‌ : నలుగురు మృతి

الأحد، 4 أكتوبر 2026

Army Ambulance Collides with Stationary Lorry Four dead Purvanchal Expressway in the Haliapur area of ​​Uttar Pradesh Subedar Major Satyavan were being transported to his native village in Deoria

t f B! P L

ఉత్తరప్రదేశ్‌లోని హలియాపూర్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆర్మీ అంబులెన్స్‌ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సుబేదార్ మేజర్ సత్యవాన్ మృతదేహాన్ని చండీగఢ్‌ నుంచి ఆయన స్వగ్రామమైన దేవరియాకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతదేహంతో పాటు కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఆర్మీ అంబులెన్స్‌ బలంగా ఢీకొనడంతో సైనికుడి కుమారుడు గౌరవ్ సింగ్‌ (28), అంబులెన్స్ డ్రైవర్ జస్పాల్‌ (30) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైనికుడి సోదరుడు రాజన్ చౌధరి (35), మేనల్లుడు రామ్ సముజ్ సింగ్‌ (40)ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని ఆర్మీ అంబులెన్స్‌ ఢీకొట్టడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ