ఆప్ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక

Saturday, October 3, 2026

AAP National Chief Spokesperson Priyanka Kakkar Resigns and Joins Congress national New Delhi She remarked that it had become difficult for her to defend the indefensible

t f B! P L

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజీవ్ శుక్లా, నసీర్ హుస్సేన్, పవన్ ఖేరా సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే శ్యామ్ సుందర్ శర్మ, రజత్ రాకేశ్ టాండన్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఆప్‌ను వీడటానికి గల కారణాలను వివరిస్తూ ప్రియాంక కక్కర్.. గతంలో ఆ పార్టీ నేతలు కారు, బంగ్లా వంటి సౌకర్యాలను తీసుకోబోమని చెప్పేవారని ఇప్పుడు వ్యక్తిగత ప్రయాణాలకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. సమర్థించలేని విషయాలను ఇకపై సమర్థించడం తనకు కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు గొప్ప ఆలోచనలు, ప్రతిభ కలిగిన వ్యక్తులను ఆకర్షించిన ఆప్.. ఇప్పుడు అలాంటి వారిని కొనసాగించలేకపోతోంది. ప్రస్తుతం ఎవరిని పార్టీలోకి తీసుకుంటున్నారు? కనీసం బూత్ స్థాయిలో కూడా పనిచేయని కొత్త వ్యక్తులను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి పంజాబ్‌లో కీలక పదవులు ఇస్తున్నారు. వారికి బంగ్లాలు, కార్లు కూడా అందిస్తున్నారు. నేను ఇంకా ఎంతకాలం సమర్థించలేని విషయాలను సమర్థించగలను? అని ప్రియాంక ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ప్రియాంక కక్కర్ ఆ పార్టీపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీని సురక్షితమైన, అభివృద్ధి చెందిన నగరంగా మార్చగల సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ఆమె అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కూడా ప్రశంసలు కురిపించారు. ఆయన ఎంతో పట్టుదలతో పనిచేస్తున్నారని, కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి కాదని పేర్కొన్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ