బాలకార్మికుడు రామయ్య కుటుంబానికి నివేశన స్థల పట్టా మంజూరు
Thursday, October 1, 2026
Andhra Pradesh attention through a viral social media video Residential Plot Title Deed Granted to Child Laborer Ramayya's Family
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో బాల కార్మికుడు రామయ్య కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అండగా నిలిచారు. రామయ్య తల్లిదండ్రులకు నివేశ స్థలం మంజూరు చేస్తూ తహశీల్దార్ నాగరాజు పట్టాను అందజేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా రామయ్య పరిస్థితి అధికారుల దృష్టికి రావడంతో, అధికారులు స్పందించి బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా రామయ్య కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా నివేశ స్థలం మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి రామయ్య తల్లిదండ్రులకు నివేశ స్థల పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామయ్య కుటుంబానికి నివేశ స్థలం మంజూరు చేయడంపై తల్లిదండ్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment