Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

ప్రముఖ మరాఠీ నటి మధు కాంబికర్ కన్నుమూశారు. ఈరోజు పుణెలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారు. ఆమె మృతితో మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధు కాంబికర్ మరణవార్తను మహారాష్ట్ర ప్రభుత్వ సమాచార, ప్రజాసంబంధాల విభాగం అధికారికంగా వెల్లడించింది. ఆమె మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా కళారంగంలో కొనసాగిన ఆమె సినిమాలు, రంగస్థలం, టెలివిజన్‌తో పాటు జానపద కళలకు విశేష సేవలందించారని కొనియాడారు మరాఠీ చిత్రసీమలో మధు కాంబికర్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 'శాపిత్' (1982),'ఏక్ హోతా విదూషక్' (1992), 'జపాట్లేల' (1993) వంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మరాఠీ జానపద నృత్యరూపమైన లావణిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 'శాపిత్' చిత్రానికి గాను మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డులను అందుకున్నారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement