ఈజిప్ట్ లో బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు : క్షణాల్లో కాపాడిన యువకుడు

الاثنين، 5 أكتوبر 2026

Ahmed Ragab was standing near a shop in the Ard El-Lewa area of ​​Giza Boy Falls from Balcony in Egypt Young Man Saves Him in Seconds

t f B! P L

ఈజిప్ట్ లోని గిజాలో అర్డ్ ఎల్-లెవా ప్రాంతం ఓ దుకాణం సమీపంలో అహ్మద్ రగబ్ నిల్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఓ భవనం వైపు నుంచి అరుపులు, ఏడుపు వినిపించాయి. ఏం జరిగిందో అటువైపు చూశాడు. అంతలోనే రెండో అంతస్తు నుంచి ఓ చిన్నారి కిందకు పడిపోవడం కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రగబ్ బాలుడి వైపు పరుగెత్తాడు. అతడు కింద పడే ప్రదేశాన్ని అంచనా వేసి బాలుడిని పట్టుకునేందుకు సరైన చోట నిలబడ్డాడు. బాలుడు కింద పడుతున్న సమయంలో మధ్యలో ఓ వాషింగ్ లైన్‌కు ఢీకొన్నాడు. దీంతో అతడి వేగం కాస్త తగ్గింది. అదే సమయంలో రగబ్‌కు బాలుడి దగ్గరకు చేరుకునేందుకు కొన్ని కీలక క్షణాలు లభించాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రగబ్.. బాలుడు నేలను నేరుగా ఢీకొట్టకుండా తన చేతుల్లో పట్టుకున్నాడు. వెంటనే చుట్టుపక్కల జనం అక్కడికి చేరుకున్నారు. ఘటనపై రగబ్ మాట్లాడుతూ అంతా వేగంగా జరిగిపోయిందనీ, తన భద్రత గురించి ఆలోచించే అవకాశం లేదని తెలిపాడు. బాలుడు ప్రమాదంలో ఉన్నాడని కనిపించగానే కాపాడేందుకు పరుగెత్తాననీ, బాలుడు సురక్షితంగా ఉన్న తర్వాతే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తనకు అర్థమైందని వివరించాడు. అసలు తాను బాలుడిని అంత వేగంగా ఎలా చేరుకోగలిగానో కూడా తనకు సరిగ్గా తెలియదని రగబ్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎదురైతే అదే విధంగా చేయగలనో లేదో కూడా చెప్పలేనని అన్నాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ