షింగిల్స్‌ (పాము పొడ) - గుండె, మెదడుపైనా ప్రభావం

السبت، 3 أكتوبر 2026

arogyam health Shingles – Impact on the Heart and Brain Shingles is caused by the varicella-zoster virus. After a bout of chickenpox in childhood

t f B! P L

షింగిల్స్‌ (పాము పొడ)ను చర్మంపై వచ్చే దద్దుర్లు, నొప్పితో కూడిన వైరల్‌ సమస్యగా భావిస్తుంటారు. అయితే ఇది చర్మం, నరాలకే పరిమితం కాకపోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షింగిల్స్‌ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో గుండె, మెదడుకు సంబంధించిన రక్తనాళ సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వరిసెల్లా జోస్టర్‌ వైరస్‌ వల్ల షింగిల్స్‌ ఏర్పడుతుంది. చిన్నతనంలో చికెన్‌పాక్స్‌ వచ్చిన తర్వాత ఈ వైరస్‌ శరీరంలోని నరాల్లో క్రియారహితంగా ఉండి, కొన్ని పరిస్థితుల్లో మళ్లీ యాక్టివ్‌గా మారినప్పుడు షింగిల్స్‌ రావచ్చు. సాధారణంగా శరీరంలో ఒక వైపున తీవ్రమైన నొప్పి, మంట, దురదతో కూడిన బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తాయి. కొందరిలో దద్దుర్లు తగ్గిపోయిన తర్వాత కూడా నరాల నొప్పి కొంతకాలం కొనసాగవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ తర్వాత స్ట్రోక్‌, గుండెపోటు వంటి రక్తనాళ సంబంధిత సమస్యల ప్రమాదం పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా షింగిల్స్‌ వచ్చిన వెంటనే కొన్ని రోజులు, వారాల్లో స్ట్రోక్‌ ప్రమాదంపై ఆధారాలు బలంగా ఉన్నాయని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌, వెల్లూరుకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ అబి మనేష్‌ పేర్కొన్నారు. అందువల్ల షింగిల్స్‌ను సాధారణ చర్మ సమస్యగా నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. షింగిల్స్‌ తర్వాత అకస్మాత్తుగా ముఖం వంగడం, ఒక వైపు చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం, తీవ్రమైన తలనొప్పి, ఛాతిలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ