షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి ఊడిపడ్డ ‘రైన్ వాటర్ వెంట్ పైపు’ : ప్రమాద ధాటికి స్కూటర్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు

الجمعة، 2 أكتوبر 2026

hyderabad Rainwater Vent Pipe Falls from Shaikpet Flyover Rider Narrowly Escapes Death Scooter Front End Crushed telangana

t f B! P L

హైదరాబాద్ లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ వద్ద మరోసారి ఘోర ప్రమాదం తృప్తిలో తప్పింది. ఫ్లైఓవర్ పైభాగం నుంచి వర్షపు నీరు కిందకు వెళ్లేందుకు అమర్చిన ఒక భారీ ‘రైన్ వాటర్ వెంట్ పైపు’ అకస్మాత్తుగా ఊడిపోయి, కింద రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూటర్‌పై నేరుగా పడింది. ఈ ప్రమాద ధాటికి స్కూటర్ ముందు భాగం పూర్తిగా నజ్జునుజ్జయింది. అయితే అదృష్టవశాత్తూ వాహనదారుడు హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పి సురక్షితంగా బయటపడ్డాడు. కేవలం 15 రోజుల క్రితమే కొనుగోలు చేసిన కొత్త స్కూటీ ఇలా కళ్లముందే ధ్వంసమైపోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై పైపులు ఊడిపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే ఫ్లైఓవర్ నుంచి డ్రైనేజీ, వర్షపు నీటి పైపులు కింద ప్రయాణిస్తున్న వాహనదారులపై పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయాల్లోనూ ప్రయాణికులు అదృష్టవశాత్తూ ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వరసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఫ్లైఓవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పదేపదే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ