నేటి నుంచి అమల్లోకి వచ్చిన జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం
الخميس، 1 أكتوبر 2026
national Registration of Births and Deaths (Amendment) Act Comes into Effect Today regulations have now been significantly tightened.
దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఆలస్యంగా జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఉండగా, ఇకపై ఆ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఎవరైనా సకాలంలో జననం లేదా మరణాన్ని నమోదు చేయించకపోతే, ఆలస్యమైన కాలపరిమితిని బట్టి ప్రత్యేకమైన, కఠినమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. సమాచారాన్ని సకాలంలో ఇవ్వడాన్ని ప్రోత్సహించడంతో పాటు ధ్రువపత్రాల జారీలో పారదర్శకతను పెంచేందుకే ఈ సవరణలు తెచ్చారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తరుణంలో నేటి నుంచి జననం లేదా మరణం సంభవించి ఒక ఏడాది దాటి, రెండేళ్ల లోపు సమాచారం అందిస్తే దానిని సాధారణ పద్ధతిలో రిజిస్ట్రార్ నమోదు చేయడానికి కుదరదు. సంఘటన జరిగిన ప్రాంతంపై అధికార పరిధి ఉన్న జిల్లా మేజిస్ట్రేట్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా వారు అధికారం కల్పించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అధికారులు ఆ సమాచారం యొక్క నిజానిజాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత రుసుం చెల్లించిన తర్వాతే ధ్రువపత్రం జారీ చేయడానికి అనుమతిస్తారు. ఒకవేళ జననం లేదా మరణం జరిగి రెండేళ్లు దాటిన తర్వాత రిజిస్ట్రార్‌కు ఆలస్యంగా సమాచారం అందిస్తే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. ఇటువంటి కేసులను ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం లేదా ఆ ప్రాంతంపై అధికార పరిధి ఉన్న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రత్యేక ఆదేశాల ద్వారా మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి విచారణ, పత్రాల పరిశీలన జరిపిన తర్వాతే మేజిస్ట్రేట్ దీనికి అనుమతిస్తారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జనరల్ రిజిస్ట్రార్ కార్యాలయం గతంలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనన, మరణ ధ్రువపత్రాలు అనేవి ప్రతి పౌరుడికి అత్యంత కీలకమైన లీగల్ ఐడెంటిటీ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి పుట్టుకను లేదా మరణాన్ని చట్టబద్ధంగా నిరూపించుకోవడానికి ఈ సర్టిఫికెట్లే ప్రధాన ఆధారమని పేర్కొంది. కాలయాపన జరగకుండా ప్రతి ఒక్కరూ సకాలంలో ఈ వివరాలను రిజిస్టర్ చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఇతర భాగస్వామ్య వర్గాలతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే పార్లమెంట్ ఉభయసభలలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
ليست هناك تعليقات:
إرسال تعليق