తెలంగాణలో ప్రివిలేజ్ ఫీజు విధింపునకు నిరసనగా బార్ల బంద్ : బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటన
الاثنين، 5 أكتوبر 2026
additional 10% under the guise of a "privilege fee." Bar and Restaurants Association Announcement Bars to Shut Down in Telangana Protesting 'Privilege Fee'
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బార్‌అండ్ రెస్టారెంట్లను సోమవారం మూసివేయనున్నట్టు రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సోమవారం బార్ల బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపింది. అవసరమైతే నిరవధిక బంద్‌కు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.4 లక్షల మేరకు లైసెన్సు ఫీజు పెంచిన ప్రభుత్వం మళ్లీ ప్రివిలేజ్ ఫీజు పేరుతో 10 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించిందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో బంద్ నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న బార్లపై ప్రివిలేజ్ ఫీజు నిర్ణయం అదనపు భారం మోపనుందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించినా ఫలితం లేనందునే ఆందోళనకు దిగాలని నిర్ణయించామని చెప్పారు.
ليست هناك تعليقات:
إرسال تعليق