News Breaking
Live
wb_sunny

Breaking News

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం' పురస్కారం

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం' పురస్కారం

ఫ్లైదుబాయ్ విమానాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత పైలట్ మచ్చర్ కోలుకున్న తర్వాత ఆయనకు 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం' పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు. మచ్చర్‌ను ఈ పురస్కారాన్ని ప్రకటిస్తూ అధ్యక్షుడు హెర్జోగ్ ఆయన ధైర్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు. "పైలట్ చర్యలు ఒక పెద్ద పెను ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడ్డాయని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులకు వందనం చేస్తున్నాము. వారితో పాటు, భారతదేశానికి చెందిన కెప్టెన్ స్మిత్ మచార్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. కెప్టెన్ మచార్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఆయనకు 'రాష్ట్రపతి పౌర వీరత్వ పురస్కారం'ను ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment