సోషల్ మీడియాలో రీల్స్ చేయొద్దని వారించిన భర్త : మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భార్య

Monday, October 5, 2026

Gajwel town Husband Objects to Social Media Reels police have registered a case and are investigating the incident Siddipet district telangana Wife Dies by Suicide

t f B! P L

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోషల్ మీడియాలో రీల్స్ చేయవద్దని భర్త వారించినందుకు మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు మండలం మామిడాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన తేజస్విని (35) కి, జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్కోటిక్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం గజ్వేల్ పట్టణంలోని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీలో నివాసం ఉంటోంది. కొంతకాలం క్రితం తేజస్విని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అందులో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే భార్య ఇలా నిత్యం సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని భర్త గోపాల్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. రీల్స్ అప్‌లోడ్ చేయడం ఆపాలని భర్త గోపాల్‌రెడ్డి మందలించడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలోనే భర్త తనను రీల్స్ చేయవద్దని వారించడంతో తీవ్ర మనస్తాపానికి, తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన తేజస్విని ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ