Tuesday, October 13, 2026

వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్ : యువకుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

తెలంగాణలోని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌లోని కండ్లకోయలో ఉన్న మయూర్ ఇండియా చాక్లెట్ కంపెనీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర (23) పనిచేస్తూ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ధర్మేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈఎంటీ సిబ్బంది సీతారాం, పైలట్ కరుణాకర్ వెంటనే స్పందించి, బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఈఎన్‌టీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ధర్మేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించి బాధితుడికి వైద్య సేవలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బందిని స్థానికులు, బాధితుడి కుటుంబ సభ్యులు అభినందించారు...