చైనాలోని హెనాన్ ప్రావిన్స్ జియావోజువోకు చెందిన బీఫ్ హాట్‌పాట్ రెస్టారెంట్ చైన్ యజమాని మా యాన్లీ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు బహుమతి ఇచ్చారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన ఓ రెస్టారెంట్ యజమాని వారికి ఊహించని బహుమతి ఇచ్చారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ఏకంగా కొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. మా యాన్లీ తన సిబ్బందిలో చాలామంది ప్రతిరోజూ ఎలక్ట్రిక్ స్కూటర్లపై విధులకు వస్తున్న విషయాన్ని గమనించారు. ముఖ్యంగా చలి, వర్షం, బలమైన గాలులు వీచే సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ఓ రోజు చలి గాలులకు ఉద్యోగుల్లో ఒకరి ముఖం ఎర్రగా మారి పని ప్రదేశానికి చేరుకోవడం ఆమెను తీవ్రంగా కదిలించింది. తాను సౌకర్యవంతమైన కారులో ప్రయాణిస్తున్నప్పుడు, తన కోసం పనిచేసే ఉద్యోగులు మాత్రం ప్రతికూల వాతావరణంలో స్కూటర్లపై ఎందుకు ప్రయాణించాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 24న కొంతమంది ఉద్యోగులను సమావేశం ఉందంటూ బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు విషయం వారికి తెలిసింది. ఎంపిక చేసిన అత్యుత్తమ ఉద్యోగులకు కొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించడంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక్కో కారు విలువ సుమారు 3 లక్షల యువాన్లు (దాదాపు రూ.43 లక్షలు)గా ఉన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ కార్లను మా యాన్లీ రెండు వారాల ముందే పూర్తిగా చెల్లించి కొనుగోలు చేసినట్లు హెనాన్ టీవీ కథనాలను ఉటంకిస్తూ ఆ పత్రిక వెల్లడించింది. ఉద్యోగులు తమ జేబు నుంచి ఎలాంటి డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేకుండానే కార్లను అందుకున్నారు. ఈ అనూహ్య బహుమతిపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. "ఇంతటి బహుమతి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. బీఎండబ్ల్యూ షోరూమ్‌కు వెళ్తున్నప్పుడు బాస్ పెద్ద బొమ్మ ఇస్తానని మాత్రమే చెప్పారు" అని ఉద్యోగి లీ జీ పేర్కొన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. రెస్టారెంట్ అభివృద్ధి తన ఒక్కరి కృషితో సాధ్యపడలేదని, మొత్తం సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడం వల్లే వ్యాపారం వృద్ధి చెందిందని మా యాన్లీ వివరించారు. తాను వ్యాపారం ద్వారా పొందుతున్న ఫలితాల్లో ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. "నేను సౌకర్యంగా ప్రయాణించగలిగినప్పుడు నా ఉద్యోగులు మాత్రం చలిలో ఎందుకు ఇబ్బంది పడాలి?" అన్నదే తన ఆలోచనగా ఆమె చెప్పారు. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడంపై పలువురు మా యాన్లీని ప్రశంసిస్తున్నారు.
ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన రెస్టారెంట్ యజమాని మా యాన్లీ
الخميس، 8 أكتوبر 2026
beef hotpot restaurant chain in Jiaozuo china Henan Province international Restaurant Owner Ma Yanli Gifts BMW Cars to Employees South China Morning Post reported

ليست هناك تعليقات:
إرسال تعليق