Saturday, October 17, 2026

సరదా గిఫ్ట్‌ కోట్లరూపాయల జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టింది !

అమెరికాలోని వర్జీనియాకు చెందిన దంపతులకు స్థానిక కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన ఒక మామూలు లాటరీ టికెట్‌ ఆజన్మాంతం మర్చిపోలేని బహుమతిగా నిలిచింది. ఓ వ్యక్తి తన భార్యకు లాటరీ టికెట్‌ ను బహుమతిగా ఇచ్చాడు. అలా సరదాగా ఇచ్చిమర్చిపోయిన లాటరీ టికెట్‌ ఏకంగా రూ. 5 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకుంది ఆ డబ్బులో కొంత భాగాన్ని ట్రావెలింగ్ కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నామంటూ సంతోషంగా వెల్లడించింది. వర్జీనియాలోని బెడ్‌ఫోర్డ్ కౌంటీకి చెందిన వ్యక్తి స్థానిక కన్వీనియన్స్ స్టోర్‌లో రెండు 'గోల్డ్ 7ఎస్' స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు. వాటిని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. భార్య ఆ టికెట్లను స్క్రాచ్ చేయగా, అందులో ఒక టికెట్‌కు టాప్ ప్రైజ్ అయిన డాలర్ల 577,777 (సుమారు రూ. 5 కోట్లు) దక్కింది. ఈ డబ్బుతో తాను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేయాలని ఆశపడుతున్నట్లు ఆమె వర్జీనియా లాటరీ అధికారులతో పంచుకున్నారు.