కేజీబీవీలో విద్యార్థినులతో వంటతోపాటు పారిశుధ్య పనులు : వీడియోలు, ఫోటో లు సామాజిక మాధ్యమాల్లో వైరల్
الجمعة، 2 أكتوبر 2026
Alluri Sitarama Raju District Andhra Pradesh Hukumpeta mandal Kasturba Gandhi Balika Vidyalaya students sanitation duties alongside cooking Videos and photos viral on social media
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులు పుస్తకాలు పట్టాల్సిన చేతులతో చపాతీలు తయారు చేస్తున్నట్లు, వంటతోపాటు పారిశుధ్య పనులు చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోలు, ఫోటో లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కలకలం రేపుతోంది. పిల్లలను చదివించేందుకు పంపితే ఇలాంటి పనులు చేయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులతో వంట, పారిశుధ్య పనులు చేయిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులకు ఎదురు చెప్పలేక, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తరగతుల సమయంలోనూ పనులు చేయిస్తున్నట్లు విద్యార్థినులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట బాలికలతో ఇలాంటి పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులతో పనులు చేయించడాన్ని కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నించారని, అనంతరం నలుగురు ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాల్లోని కేజీబీవీలకు ప్రత్యేక బదిలీల పేరుతో పంపించారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ బదిలీలకు విద్యార్థినులతో పనులు చేయిస్తున్న అంశమే కారణమా అనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కేజీబీవీ నిర్వహణ, విద్యార్థినులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలపై జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరపాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. బాలికల చదువు, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
ليست هناك تعليقات:
إرسال تعليق