Saturday, October 17, 2026

మొయినాబాద్ ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం

తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో ఏటీఎంలోని వైర్లను ధ్వంసం చేశారు. అక్టోబర్ 16వ తేదీ రాత్రి 11:25 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌బీఐ మొయినాబాద్ బ్రాంచ్ మేనేజర్ వి. శ్రీనివాసరావు అక్టోబర్ 17న మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎంలో చోరీకి యత్నించిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.