భారత శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సహా ఏ సంస్థ వచ్చినా స్వాగతిస్తామని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, ఆ రంగంలో పోటీ పడే ప్రతి సంస్థ భారత చట్టాలు, నిబంధనలు, విధానాలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టే దేశీయ, విదేశీ సంస్థలన్నింటికీ ప్రభుత్వం ఒకే విధమైన ప్రక్రియను అమలు చేస్తోందని రిలయన్స్ తెలిపింది. ప్రభుత్వ విధానాలు, చట్టాలకు అనుగుణంగానే ప్రతి సంస్థకు అనుమతులు లభిస్తాయని పేర్కొంది. తమ సంస్థకు చెందిన జియో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని గుర్తుచేసింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి వచ్చే ప్రతి సంస్థకు ఒకే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పోటీ అంటే తాము ఎప్పుడూ భయపడలేదని, పోటీకి తాము సిద్ధమని రిలయన్స్ పేర్కొంది. వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తున్నారో తెలుసుకోవడానికి పోటీనే సరైన పరీక్ష అని అభిప్రాయపడింది. భారత ప్రజలకు మేలు చేసే పెట్టుబడులు, కొత్త ఆవిష్కరణలను దేశం ఎప్పుడూ స్వాగతిస్తోందని తెలిపింది. అటువంటి వాతావరణంలోనే రిలయన్స్ కూడా అభివృద్ధి చెందిందని వివరించింది. 2016లో జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అప్పటికే అనేక సంస్థలు పోటీలో ఉన్నాయని గుర్తుచేసింది. ఒక్క వినియోగదారుడు కూడా లేని సంస్థగా మార్కెట్లోకి వచ్చిన జియో, పదేళ్లలో 53 కోట్ల మందికి పైగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించిందని రిలయన్స్ తెలిపింది. అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ సేవలు అందించడంతోపాటు, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత ప్రజలకు చేరువ చేశామని పేర్కొంది. శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో స్టార్‌లింక్‌తో సహా ఇతర సంస్థలు పోటీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని మరోసారి స్పష్టం చేసింది. అయితే జియో అయినా, విదేశీ సంస్థ అయినా భారత ప్రజలకు సేవలు అందించేటప్పుడు దేశ చట్టాలు, విధానాలను తప్పనిసరిగా పాటించాలని వెల్లడించింది. అంతకముందు మాస్క్ ,, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. భారత్‌లో అంబానీకి చెందిన సంస్థలు అందిస్తున్న తక్కువ ధరల ఇంటర్నెట్ సేవలతో స్టార్‌లింక్ పోటీ పడలేదని కొందరు చెబుతున్నారని, అదే సమయంలో స్టార్‌లింక్ వస్తే తీవ్ర పోటీ ఏర్పడుతుందని వాదిస్తున్నారని మస్క్ పేర్కొన్నారు. ఈ రెండు వాదనల మధ్య వైరుధ్యం ఉందని విమర్శించారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో పోటీ పెరిగితే భారత వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయని మస్క్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంస్థల లాభాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వాటి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని చెప్పలేమని పేర్కొన్నారు. గతంలోనూ భారత టెలికాం రంగంలో గుత్తాధిపత్య ధోరణులు ఉన్నాయంటూ మస్క్ విమర్శలు చేశారు. స్టార్‌లింక్ సేవలకు అనుమతుల విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Home
business
emphasized that any company competing in this space must strictly adhere to Indian laws
including Starlink
national
Reliance welcomes any company
technology
స్టార్‌లింక్ సహా ఏ సంస్థ వచ్చినా స్వాగతిస్తాం : రిలయన్స్ సంస్థ
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

