ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ ధృవ్ రాఠీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి గల కారణాలు ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు. ఏ కేసు ప్రాతిపదికన ఆయనను అరెస్ట్ చేశారనేది వెల్లడికావాల్సి ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనత పార్టీ భారీ ఆందోళన నేపథ్యంలో ధృవ్ రాఠీ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గుర్గావ్ సెక్టార్ 56లోని కేంద్రీయ విహార్ ప్రాంతంలో ధృవ్ రాఠీ నివసిస్తోన్నారు. ఈ ఉదయం సుమారు 7:50 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ధృవ్ రాఠీ తల్లి తలుపులు తెరవగానే పోలీసులు ఇంటి లోనికి ప్రవేశించి ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం అర్ధరాత్రి నుంచే ఆయన ఇంటి వెలుపల నిఘా ఉంచినట్లు సమాచారం. మఫ్టీలో వచ్చిన దాదాపు 50 మంది పోలీసులు ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్నారని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే సంస్థ తెలిపింది. ఈ అరెస్ట్ కు సంబంధించి ఢిల్లీ పోలీసుులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. జంతర్ మంతర్ పరిసరాల్లో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యానే రాఠీని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. రెండు రోజుల కిందటే బెంగళూరులో కాక్రోచ్ జనత పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చర్యలను తప్పుపట్టారు. ఆ పార్టీ ఫౌండర్, అభిజిత్ డిప్కే, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి ప్రసంగించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు నుంచి శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అర్ధరాత్రి ఇండియా గేట్ వద్ద ఓ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆ తర్వాత గుర్గావ్‌లోని తన ఇంటికి వెళ్లారు. శనివారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ప్రజా ఆందోళనలో పాల్గొంటానని ఈ వీడియో ద్వారా వెల్లడించారు కూడా. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవంక.. కాక్రోచ్ జనత పార్టీ ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 150 మందికి పైగా ఆందోళనకారులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Travel the world
Climb the mountains
nationalsignificance against the backdrop of a massive protest organized by the 'Cockroach Janata Party'Social Media Influencer and Content Creator Dhruv Rathee Detained by Delhi Police
ఢిల్లీ పోలీసులు అదుపులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ ధృవ్ రాఠీ
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment