2014లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిలో ఉన్న తనను భారత క్రికెట్ బోర్డు ఉన్నట్టుండి తొలగించడం ఎంతో బాధకు గురిచేసిందని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనిల్ కుంబ్లేను ప్రధాన కోచ్‌గా చేయాలనే ఉద్దేశంతో తనను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి తప్పించారన్నాడు. ఎలాంటి కారణాలు లేకుండానే డైరెక్టర్ పదవిని బీసీసీఐ తీసి వేసిందని, డైరెక్టర్ పదవిలో ఉన్న తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నాడు. కొంత మంది బీసీసీఐ పెద్దలకు తాను ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదన్నాడు. అందుకే వారు అవమానకర రీతిలో తనను ఆ పదవి నుంచి తప్పించారని వాపోయాడు. కాగా, టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ తనను కోరిందన్నాడు. బీసీసీఐ విజ్ఞప్తికి తాను సానుకూలంగా స్పందించి కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశానని రవిశాస్త్రి గుర్తు చేశాడు. అయితే కోచ్‌ను ఎంపిక చేసిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఒకడైన సౌరవ్ గంగూలీ తనను ఇంటర్వూ చేసేందుకు రాలేదన్నాడు. ఇది తనను ఎంతో బాధకు గురిచేసిందన్నాడు. భారత జట్టుకు అవసరమైన ప్రతిసారి విలువైన సేవలు అందించానని, అయినా కూడా తనకు తగిన గౌరవడం దక్కలేదన్నాడు. ఇక గంగూలీ తదితరులు తనపై వ్యవహరించిన తీరు ఎంతో బాధించిందని రవిశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
Travel the world
Climb the mountains
BCCI bigwigs didn't want me to continuecricketFormer Team India Head Coach Ravi ShastriI was deliberately removed from the 'Director of Cricket' rolesports
డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి కావాలనే తప్పించారు : బీసీసీఐ పెద్దలకు తాను ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదు
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment