ప్రాణం తీసిన వివాహేతర సంబంధం : చంపి, శవాన్ని డీజిల్‌ పోసి తగలబెట్టిన ప్రియుడు

Sunday, October 4, 2026

Chellapur village in Vikarabad district crime Fatal Extramarital Affair Lover Kills Woman and Burns Body with Diesel telangana

t f B! P L

తెలంగాణలోని వికారాబాదు జిల్లా చెల్లాపూర్‌ గ్రామానికి చెందిన అమృతమ్మ(34)కు కుల్కచర్లకు చెందిన గంధం భీమయ్యతో వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి చెల్లాపూర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. అప్పుడప్పుడూ కుల్కచర్లలోని అత్తవారింటికి వచ్చి వెళ్తోంది. ఈక్రమంలో అదేగ్రామానికి చెందిన మంగలి ఆనంద్‌ (28)తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కుల్కచర్లలోని ఇల్లును చూసి వస్తానని చెప్పిన అమృతమ్మ గత నెల 18న చెల్లాపూర్‌ నుంచి బయల్దేరింది. మూడు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో 29న కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రమేష్‌ దర్యాప్తు ప్రారంభించారు. ఆమెతో సన్నిహితంగా ఉంటున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా అమృతమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మంగలి ఆనంద్‌ ఆమెను హత్యచేసినట్లుగా గుర్తించారు. ఆనంద్‌తో సన్నిహితంగా ఉంటున్న అమృత అతని అవసరాల నిమిత్తం బంగారు, వెండి ఆభరణాలను ఇచ్చింది. వీటిని తనఖా పెట్టిన ఆనంద్‌ రూ.2 లక్షలు తీసుకుని వాడుకున్నాడు. తన నగలు ఇవ్వాలని పదేపదే అడుగుతుండటంతో అమృతమ్మను చంపాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 18న కొత్తపల్లిలో ఆమెను కారు ఎక్కించుకుని మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ మండలం వెన్నాచెడ్‌ చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి చీరకొంగును మెడకు బిగించి హత్యచేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం డీజిల్‌ పోసి నిప్పంటించాడు. మృతదేహం కాలకపోవడం, అప్పటికే ఎక్కువ సమయం కావడంతో ఆందోళనకు గురై బాడీని మూట కట్టి కారులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణ జిల్లా తుంగభద్ర నదీ పరీవాహక అటవీ ప్రాంతంలో పడేశాడు. విచారణ అనంతరం మృతదేహం మూటను పోలీసులు గుర్తించారు. శవపంచనామా నిర్వహించి, అదృశ్యం కేసును హత్యకేసుగా మార్చి తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ