పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా ఎనర్జీ : పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంపు

السبت، 3 أكتوبر 2026

business Hike of ₹5 per Litre for Petrol and ₹3 per Litre for Diesel Nayara Energy Raises Petrol and Diesel Prices new rates came into effect on Saturday technology

t f B! P L

ప్రైవేట్ రంగానికి చెందిన చమురు విక్రయ సంస్థ 'నయారా ఎనర్జీ' పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. ఈ కొత్త ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు, ఇంధన ధరలు తీవ్రంగా పెరగడం వల్ల కొనుగోలు వ్యయం అధికమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి ఉన్న 7,000కు పైగా పెట్రోల్‌ బంకుల్లో ఈ నూతన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. నయారా ఎనర్జీ ఈ ఏడాది ఇంధన ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు మార్చి నెలలో కూడా పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో, పెట్రోల్‌, డీజిల్‌పై ఇదే స్థాయిలో ధరలను పెంచింది. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో జులైలో ఆ పెంపును వెనక్కి తీసుకుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ