ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరు 25 ఏళ్లుగా ఒక ఫ్లైఓవర్ అసంపూర్తిగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మారినా గూడూరు ఫ్లైఓవర్ మాత్రం పూర్తి కావడం లేదు. గూడూరు పట్టణాన్ని రెండుగా విడదీస్తోంది ఈ రైల్వే లైన్. గూడూరు-1, గూడూరు-2 లను కలిపేందుకు 2001లోనే అప్పటి ప్రభుత్వం ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేసింది. అప్పటి అంచనా రూ. 7.36 కోట్లు మాత్రమే. కానీ అధికారుల నిర్లక్ష్యం, జీఏడీ అప్రూవల్స్ ఆలస్యం, డిజైన్ లో మార్పులు, పశ్చిమ వైపు అప్రోచ్ రోడ్డు వివాదాలు కోర్టుకెళ్లడంతో ప్రాజెక్టు అటకెక్కింది.ఈ ఆలస్యంతో 2012 నాటికి ప్రాజెక్టు అంచనా రూ. 43.09 కోట్లకు పెరిగింది. రైల్వే శాఖ 2013లో తమ వైపు పనులు మొదలుపెట్టింది. కానీ పిల్లర్లు లేచాయి తప్ప, బ్రిడ్జి పూర్తిగా కలవలేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో కూడా ఈ జాప్యాన్ని తప్పుబట్టింది. అయినా నెల్లూరు జిల్లా గూడూరు ఫ్లైఓవర్ ఇప్పటికీ అసంపూర్తిగానేఉంది. రోజూ 100కు పైగా రైళ్లు వెళ్తాయి. దీంతో రోజుకు 50 సార్లుకు పైగా గేట్లు పడుతున్నాయి. ఒక్కోసారి గేటు పడితే అరగంట, గంట వరకు తీయరు.నెల్లూరు జిల్లా గూడూరులో ఒక మనిషి చనిపోతే, శవాన్ని స్మశానానికి తీసుకెళ్లాలన్నా గంటల తరబడి గేటు వద్ద ఆగాల్సిన దుస్థితి. ఇప్పటికైనా నెల్లూరు జిల్లా గూడూరు ఫ్లైఓవర్ ను పూర్తి చేయాలని, ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి మర్చిపోకుండా, వెంటనే పనులు వేగవంతం చేసి ప్రజలకు విముక్తి కలిగించాలని గూడూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
25 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నఫ్లైఓవర్ : గూడూరు పట్టణాన్ని రెండుగా విడదీస్తున్న పై వంతెన
الأربعاء، 7 أكتوبر 2026
Andhra Pradesh Despite changes in governments and the election of various MLAs and MPs Flyover Incomplete for 25 Years Nellore district The Bridge Dividing Gudur Town

ليست هناك تعليقات:
إرسال تعليق