కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన చిన్న కన్నడ చిత్రం 'ప్రేమద ఊరలి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. మనోజ్ కుమార్ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీరామ్, రంగాయన రఘు, తపస్విని పూనాచ, రమైక శివు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో రెండు వారాల క్రితం ప్రేమనే ఊరిలో విడుదలైన ఈ మూవీ ఇక్కడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా రన్ అవుతోంది. కానీ సరైన ప్రచారం లేక జనాలను పూర్తిగా రీచ్ కాలేక పోయింది. తండ్రీకొడుకుల అమాయకత్వం, పల్లెటూరి స్వచ్ఛమైన కథతో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ డ్రామా నేచురల్ ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బలమైన మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ రాకతో ఏకంగా రూ.50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇటీవల మన దగ్గర రవితేజ ఇరుముడి సినిమా విషయంలో జరిగినట్లుగానే కన్నడ నాట ఈ ప్రేమనే ఊరిలో చిత్రం అదేవిధమైన హంగామా చేసింది ఇంకా స్టడీగా కలెక్షన్లు కొల్లగొడుతుంది.
Travel the world
Climb the mountains
cinemaKannada Film 'Premada Oorali' Grosses ₹50 Crore on a ₹2 Crore BudgetRamaika ShivuRangayana RaghuTapasvini Poonachathe movie features SriramWritten and directed by Manoj Kumar
రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.50 కోట్లను రాబట్టిన కన్నడ చిత్రం 'ప్రేమద ఊరలి'
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment