'మండీ బిర్యానీ' తిని యువకుడు మృతి : మరో 15 మందికి తీవ్ర అస్వస్థత

తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 'వన్ ప్యాలెస్' రెస్టారెంట్‌లో ఆహారం తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయిరాం (19) అనే యువకుడు మృతి చెందాడు. మరో పదిహేను మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం నర్సాపూర్ వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో వీరంతా ‘మండీ బిర్యానీ’ తిన్నట్లు తెలుస్తోంది. ఆహారం తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో తీవ్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 19 ఏళ్ల యువకుడు మరణించడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం, ఆందోళన వ్యక్తమవుతోంది. ఫుడ్ పాయిజన్‌తో యువకుడి ప్రాణం పోవడానికి కారణమైన ‘వన్ ప్యాలెస్’ రెస్టారెంట్ యాజమాన్యం, చెఫ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

Written By

Amateur Full-Stack Developers and Full-Stack UI Designer • Powered by love and coffee • Portofolio on dribbble.com/sanengineer