శ్రీరామ్ ఫైనాన్స్ వివిధ కాలపరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ముఖ్యంగా దీర్ఘకాలిక డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభించనుంది. గతంలో 36 నుంచి 60 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ ఉండగా, ఇప్పుడు దాన్ని 7.85 శాతానికి పెంచింది. అలాగే 15 నెలల డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని 7.10 శాతం నుంచి 7.50 శాతానికి చేర్చింది. 12 నెలల డిపాజిట్లపై గతంలో 6.85 శాతం వడ్డీ ఉండగా, ఇప్పుడు 7 శాతానికి పెరిగింది. 15 నెలల డిపాజిట్లపై 7.10 శాతం నుంచి 7.50 శాతానికి చేరింది. 18 నుంచి 23 నెలల డిపాజిట్లపై వడ్డీ 7.05 శాతం నుంచి 7.25 శాతానికి పెరిగింది. 24 నుంచి 35 నెలల FDలపై గతంలో 7.10 శాతం ఉండగా, ఇప్పుడు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 36 నుంచి 60 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్లు, మహిళలకు అదనపు వడ్డీ ప్రయోజనాలను కొనసాగిస్తోంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి సాధారణ వడ్డీ రేటుపై అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. మహిళా పెట్టుబడిదారులకు వర్తించే వడ్డీ రేటుపై అదనంగా 0.05 శాతం అందుతుంది. అలాగే, మెచ్యూరిటీ పూర్తయిన డిపాజిట్లని తిరిగి రెన్యువల్ చేసుకునే వారికి అదనంగా 0.15 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అయితే, ఈ ప్రయోజనాలకు వర్తించే నిబంధనలు, అర్హతలను పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాలి. డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు తమకు ఎంతకాలం తర్వాత డబ్బు అవసరమవుతుందో ముందుగా నిర్ణయించుకోవాలి.
Travel the world
Climb the mountains
additional interest benefits to senior citizens and womenbusinessEffective from October 11Shriram Finance Raises Interest Rates on Fixed Deposits
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన శ్రీరామ్ ఫైనాన్స్ : అక్టోబర్ 11 నుంచి అమలు
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment