దేశీయ మార్కెట్లో గోయీన్ సంస్థకు చెందిన చలో 1000 వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు అనువైన ఒక ఆప్షన్ గా నిలుస్తోంది. ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన లుక్ , నగర ప్రయాణాలకు అనువైన పెర్ఫార్మన్స్ తో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు సంప్రదాయ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, మార్కెట్‌కు వెళ్లడం, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగకరంగా ఉంటున్నాయి . ఎలక్ట్రిక్ మోటార్ ఆధారంగా పనిచేసే ఈ స్కూటర్‌లో ప్రయాణ సౌకర్యంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ రహదారుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని డిజైన్ఈ చేసారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక డిజైన్, శక్తివంతమైన మోటార్, ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. 60V , 72V బ్యాటరీ వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి.ఈ స్కూటర్‌లో 1,500W రేటెడ్ పవర్, 2,000 W పీక్ పవర్ కలిగిన BLDC హబ్ మోటార్‌ను అందించారు. కంపెనీ ప్రకారం టాప్ స్పీడ్ 80 kmph .దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతుంది .లిథియం, లెడ్-యాసిడ్ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. లిథియం బ్యాటరీ ఛార్జింగ్‌కు సుమారు 4 గంటలు, లెడ్-యాసిడ్ బ్యాటరీకి సుమారు 8 గంటలు పడుతుంది బ్యాటరీ పెర్ఫార్మన్స్ పర్యవేక్షించేందుకు స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టంను అందించారు. డిజైన్ పరంగా ట్విన్ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్, LED లైటింగ్, వెడల్పైన టైర్లు, ఆకర్షణీయమైన బాడీ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటాయి. రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, ఎలక్ట్రానిక్ వీల్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ECO ,SMART ,HYPER రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు 220 mm, వెనుక 180 mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక స్ప్రింగ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ను అందించారు. 90/90-12 ముందు టైర్, 120/70-12 వెనుక టైర్, 170mm. గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ లోడ్ సామర్థ్యం 150 కిలోలు, బ్యాటరీ లేకుండా బరువు 80 కిలోలు. మోటార్‌కు IP66 ప్రొటెక్షన్ రేటింగ్‌ను అందించారు. Army Olive ,Frost White , Blaze Orange ,Glacier Blue ,Lunar Silver ,Sage Green రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
రోజువారీ ప్రయాణాలకు అనువైన ఒక ఆప్షన్ గోయీన్ సంస్థకు చెందిన చలో 1000 వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్
byTelugu Lo Computer
•
•
2 min read
