ホーム
/
Uttar Pradesh
/
ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు పట్టుపడ్డ భర్త : భార్యను కారు బానెట్‌పై 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన భర్త
الأحد، 4 أكتوبر 2026
Drags Wife 100 Meters on Car Bonnet Husband Caught Red-Handed with Girlfriend by Wife Meerut Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రియురాలితో కలిసి మోమోస్ తినడానికి వెళ్లిన ఓ భర్త వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసి చివరికి జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి చేరింది. ప్రియురాలితో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఆమెపైకే కారు దూకించి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మయాంక్ అనే వ్యక్తి తన ప్రియురాలిగా చెబుతున్న మహితో కలిసి మీరట్‌లోని ఓ ప్రాంతంలో మోమోస్ తింటుండగా అతని భార్య సునీత నేరుగా అక్కడికి చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తను మరో మహిళతో చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత, వారి కారు అద్దాలు తడుతూ నిలదీయడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మయాంక్, వెంటనే కారు డోర్లు లాక్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. భర్త పారిపోకుండా అడ్డుకునే క్రమంలో సునీత కారు ముందుకు వచ్చి బానెట్‌పై పడుకుంది. భార్య బానెట్‌పై ఉండగానే కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. "అన్నా కాపాడండి - ఎవరైనా రక్షించండి" అంటూ సునీత భయంతో ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ, దాదాపు 100 మీటర్ల దూరం ఆమెను బానెట్‌పైనే ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు, బాటసారులు పెద్ద సంఖ్యలో గుమిగూడి అడ్డుకోవడంతో మయాంక్ తప్పనిసరి పరిస్థితుల్లో కారును ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు సునీత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తనపై దాడి చేసి, వరకట్న వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. భార్యను చంపే ఉద్దేశంతోనే కారును ఆమెపైకి దూకించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో మయాంక్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కొత్వాలి సర్కిల్ ఆఫీసర్ సంగ్రామ్ సింగ్ తెలిపారు. పోలీసులు నిందితుడు మయాంక్‌తో పాటు అతని ప్రియురాలు మహిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఘటనకు ఉపయోగించిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ కారును స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق