Sunday, October 18, 2026

హెచ్-1బి వీసా నిబంధనల్లో పెరిగిన అనిశ్చితి : అమెరికా నుంచి భారత్‌ తిరిగొచ్చిన 12700 మంది టెక్ నిపుణులు

అమెరికా నుంచి భారత్‌ టెక్నాలజీ నిపుణులను మళ్లీ స్వదేశం వైపు అడుగులు వేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం 2026 మొదటి తొమ్మిది నెలల్లోనే సుమారు 12,700 మంది వైట్-కాలర్ టెక్ నిపుణులు అమెరికా నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. గత కొన్ని ఏళ్లుగా పెరుగుతున్న ఈ ధోరణి పెరుగుతోంది. 2023లో 7,200, 2024లో 9,800, 2025లో 15,100 తిరిగి రాగా ఈ ఏడాది ఆల్-టైమ్ రికార్డు నమోదు చేసే దిశగా పయనిస్తోంది. స్వదేశానికి తిరిగొస్తున్న వారిలో అధికులు హైదరాబాద్, బెంగళూరు, పూణే, గుర్గావ్ వంటి ప్రధాన టెక్ నగరాల్లో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్‌కు కారణం హెచ్-1బి వీసా నిబంధనల్లో పెరిగిన అనిశ్చితి, గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు , అమెరికా ప్రధాన కంపెనీల్లో సాగుతున్న నిరంతర లేఆఫ్‌లు కారణమని చెబుతున్నారు. వర్క్ వీసాలు పునరుద్ధరణ కాకపోవడం , ఉద్యోగం పోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం లభించకపోవడంతో ఎంతోమంది అనివార్యంగా స్వదేశానికి తిరిగొస్తున్నారు. దీనికి తోడు, అమెరికాలో పెరిగిన జీవన వ్యయం, పిల్లల భవిష్యత్తు, కుటుంబ అవసరాలు కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. భారత్‌లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు , బహుళజాతి ఐటీ కంపెనీలు అమెరికా అనుభవం ఉన్న నిపుణులను ఆహ్వానిస్తున్నప్పటికీ, ఇక్కడి మార్కెట్ వారికి కొత్త సవాళ్లను విసురుతోంది. స్వదేశానికి వచ్చిన టెక్నీషియన్లు అమెరికాలో పొందిన జీతాలతో పోలిస్తే దాదాపు 65% నుంచి 75% వరకు తక్కువ వేతనాన్ని అంగీకరించాల్సి వస్తోంది. అంతేకాకుండా, ఇప్పటికే దేశీయంగా అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన స్థానిక టెక్ నిపుణులతో వీరు తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఈ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ భారత ఐటీ, స్టార్టప్ రంగానికి సరికొత్త శక్తినందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. గ్లోబల్ ప్రాజెక్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్లౌడ్ టెక్నాలజీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులు స్వదేశానికి రావడం వల్ల భారతీయ కంపెనీలకు మేధో సంపత్తి, అంతర్జాతీయ అనుభవం లభిస్తాయి. భారత్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా ఈ పరిణామం కీలకమైన మలుపుగా మారనుంది.