సుజుకి ఐకానిక్ సూపర్‌బైక్ హయబుసా స్పెషల్ ఎడిషన్ ను విడుదల
الأربعاء، 30 سبتمبر 2026
automobile business Suzuki Launches Special Edition of Iconic Hayabusa Superbike technology updated models are already available at Suzuki showrooms across the country
దేశీయ మార్కెట్లో సుజుకి ఐకానిక్ సూపర్‌బైక్ హయబుసా స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసింది. 2026 మోడల్ స్పెషల్ ఎడిషన్ ధరను రూ.19.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇది సాధారణ హయబుసా కంటే రూ.91,000 ఎక్కువ. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి షోరూమ్‌లలో ఈ అప్‌డేటెడ్ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం Pearl Vigor Blue అనే సింగిల్ కలర్‌లో అందిస్తున్నారు. సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేక డీకాల్స్, భిన్నమైన వీల్ ఫినిష్, 3D సుజుకి ఎంబ్లమ్, ఫ్యూయల్ ట్యాంక్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ వంటి మార్పులు ఉన్నాయి. అలాగే మఫ్లర్ ఎండ్, హీట్ గార్డ్స్‌కు అనోడైజ్డ్ ఫినిష్ ఇచ్చారు. సాధారణంగా యాక్సెసరీగా లభించే సింగిల్-సీట్ కౌల్‌ను స్పెషల్ ఎడిషన్‌లో స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అయితే ఇంజిన్ లేదా ఇతర ప్రధాన మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే అదనంగా చెల్లించే రూ.91,000 ప్రధానంగా ఈ కాస్మెటిక్ అప్‌డేట్స్ కోసమే. 2026 హయబుసా స్టాండర్డ్ మోడల్ ధర ఇప్పుడు రూ.18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. గత మోడల్‌తో పోలిస్తే ధర రూ.93,000 పెరిగింది. స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్ రెండు మోడళ్లలోనూ ఇప్పుడు ELIIY Power లిథియం-అయాన్ బ్యాటరీను ఉపయోగించారు. ఇది పాత బ్యాటరీ కంటే తేలికగా, కాంపాక్ట్‌గా ఉండటంతో పాటు లోడ్ సమయంలో స్థిరమైన వోల్టేజ్‌ను అందిస్తుందని సుజుకి తెలిపింది. అదేవిధంగా లాంచ్ కంట్రోల్, పవర్ మోడ్ సెలెక్టర్ సెట్టింగ్స్‌ను కూడా రివైజ్ చేశారు. స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్‌లో మరో ఆసక్తికరమైన మార్పు ఉంది. గేర్ మార్చిన సమయంలో కూడా క్రూయిజ్ కంట్రోల్ యాక్టివ్‌గా కొనసాగుతుంది. దీంతో నిర్ణయించిన వేగాన్ని కొనసాగించేందుకు రైడర్ నిరంతరం థ్రాటిల్‌ను ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. హయబుసా స్పెషల్ ఎడిషన్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇందులో 1,340cc లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-4 ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 190bhp పవర్, 142Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. బైక్‌లో ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్, అడ్జస్టబుల్ KYB USD ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ ఉన్నాయి. ముందు భాగంలో ట్విన్ 320mm ఫుల్-ఫ్లోటింగ్ డిస్క్‌లతో నాలుగు-పిస్టన్ Brembo Stylema కాలిపర్లు, వెనుక 260mm డిస్క్‌తో Nissin కాలిపర్ ఉన్నాయి. దీనిలో ఆరు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో మూడు ప్రీసెట్ మోడ్‌లు కాగా, మరో మూడు కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా కార్నరింగ్ ABS, లాంచ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్, హిల్-డిసెంట్ కంట్రోల్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి. బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై Bridgestone Battlax Hypersport S22 టైర్లతో వస్తుంది. దీని సీట్ హైట్ 800mm కాగా, కెర్బ్ వెయిట్ 266 కిలోలుగా ఉంది.
ليست هناك تعليقات:
إرسال تعليق