ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి

الثلاثاء، 29 سبتمبر 2026

crime Officials are meticulously examining CCTV footage and hotel registration records SR Nagar area of ​​Hyderabad telangana Young Woman Dies Under Suspicious Circumstances in OYO Room

t f B! P L

హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో ఉన్న గోకుల్ ప్రైడ్ ఓయో హోటల్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక యువకుడు, యువతి ‘సి. గణేష్’  పేరుతో 103వ నంబర్ గదిలో బస చేశారు. ఉదయానికి ఆ యువతి గదిలో విగతజీవిగా పడి ఉండటంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన యువతి వివరాలపై పోలీసులు రకరకాల కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆమె ఆధార్ కార్డును పరిశీలిస్తే అందులో పేరు దుర్గ అని ఉంది. అయితే గతంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో ఆమె పేరు శిరీష అని నమోదైంది. గతంలో ఆమె తన భర్త చేతిలో తీవ్ర దాడికి గురై చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పేర్లు మారడం వెనుక అసలు నిజాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు. హోటల్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో పాటు రిజిస్టర్ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ యువతితో పాటు గదికి వచ్చిన యువకుడు ఎవరు అనే దానిపై ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. త్వరలోనే ఈ కేసుకి సంబంధించి పూర్తి నిజాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ