ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

Friday, September 25, 2026

​​Andhra Pradesh heavy rains that have been lashing Vijayawada city for the past two days Landslide on Indrakeeladri Ghat Road VIJAYAWADA

t f B! P L

విజయవాడ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాల ప్రభావంతో గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల కోసం గత మూడు రోజులుగా అధికారుల ముందస్తు నిర్ణయంతో ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయడం వలన, శ్రీ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం ఉదయం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మరియు ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఘాట్ రోడ్డులోని ప్రభావిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. కొండపై నుండి ఘాట్ రోడ్డుపై జారిపడిన భారీ బండరాళ్లు, రాతిపెళ్లలు, మట్టిని వెంటనే పొక్లెయిన్లు, క్రేన్ల సహాయంతో యుద్ధప్రాతిపదికన తొలగించి మార్గాన్ని శుభ్రం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కొండచరియల పై వర్షపు నీటి ఊట కారణంగా మట్టి నానిపోయి ఉందని,ఇంకా ఎక్కడైనా కొండచరియలు జారే అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని సాంకేతిక నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రమాదకరంగా ఉన్న వదులైన రాళ్లను ముందుగానే గుర్తించి నియంత్రిత పద్ధతిలో తొలగించాలని సూచించారు. కొండచరియలు పడిన ప్రాంతంలో రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) మరియు ఐరన్ ఫెన్సింగ్ రాక్-ఫాల్ నెట్లను మరింత పటిష్టంగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డును పూర్తిగా పునరుద్ధరించేందుకు క్షేత్రస్థాయిలో భద్రతా తనిఖీలు పూర్తిచేసే వరకు ఘాట్ రోడ్డు వైపునకు ఎవరినీ అనుమతించవద్దని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనానాయక్ మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో తాము నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని, గురు వారం రాత్రి తాను ఘాట్ రోడ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇంజినీరింగ్ సిబ్బందిని అప్రమత్తం చేయడం, ముందుజాగ్రత్త చర్యగా ఘాట్ రోడ్డు మూసివేత వల్ల పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు.దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. కన్నబాబు,కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఘాట్ రోడ్ పరిస్థితి పై ఎప్పటికప్పుడు తెలుసుకొని, తక్షణచర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ