ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. ఈ ఏడాది సదస్సు ఒక చారిత్రక మైలురాయి అని, బ్రిక్స్ కూటమి ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇది సరికొత్త బాధ్యతలకు నాంది పలుకుతుందని మోడీ ఆకాంక్షించారు. అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకోవడంలో గ్లోబల్ సౌత్ ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై గ్లోబల్ సౌత్ కేవలం ఇతరుల నిబంధనలు పాటించే స్థాయి నుంచి, నిబంధనలు రూపొందించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికోసం వచ్చే బ్రిక్స్ సదస్సు నాటికి ఒక ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని, 10 గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలను వెంటనే అమలు చేయాలని మోడీ తన ప్రసంగంలో ప్రతిపాదించారు.

Post a Comment

أحدث أقدم