లైంగిక వేధింపులు తాళలేక సింగరేణి సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

الأربعاء، 16 سبتمبر 2026

Engineering Student Intern at Singareni Dies by Suicide After Enduring Sexual Harassment.Godavarikhani Peddapalli district telangana

t f B! P L

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సింగరేణి సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఓవర్‌మ్యాన్ వేధింపులపై సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఆ యువతి ఈ ఏడాది ఫిబ్రవరిలో సింగరేణిలోని 2 ఇంక్లైన్ గనిలో ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. అక్కడ ఓవర్‌మ్యాన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీనిపై బాధితురాలు సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ, వారు దానిని తేలికగా తీసుకుని కొట్టిపారేశారు. దీంతో విసిగిపోయిన ఆమె ఇంటర్న్‌షిప్ మానివేసి స్థానికంగా ఒక కంప్యూటర్ సెంటర్‌లో చేరింది. అయితే, రవికుమార్‌తో పాటు ఆమె పాలిటెక్నిక్ లెక్చరర్ నవీన్ కూడా వేధింపులను కొనసాగించారు. నిరంతర వేధింపులు తాళలేక ఆ యువతి సెప్టెంబర్ 13వ తేదీన పురుగుల మందు సేవించింది. గమనించిన లెక్చరర్ నవీన్ ఆమెను ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుండి పరారయ్యాడు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులు రవికుమార్, నవీన్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ అత్యంత కీలకమైందిగా మారింది. తనపై ఓవర్‌మ్యాన్ రవికుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడని, సింగరేణి యాజమాన్యం తన ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదని ఆ నోట్‌లో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన మరణం ద్వారానైనా ఆ కామాంధుడికి కఠిన శిక్ష లభించాలని ఆమె కోరింది. ఈ దారుణ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, బాధ్యులైన సింగరేణి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. మృతురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని కోరాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బాధితుల కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి, నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ