మూడేళ్ల చిన్నారిపై నుంచి కారును వేగంగా నడిపిన దుండగుడు : హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు

Sunday, September 20, 2026

hit-and-run case registered Miscreant speeds car over three-year-old child Santoshnagar area of ​​Hyderabad Old City Shocking footage of the incident was captured on CCTV

t f B! P L

హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్ లో మూడేళ్ల చిన్నారిపై నుంచి ఓ దుండగుడు కారును వేగంగా నడిపాడు. చిన్నారిని కారుతో ఢీ కొట్టడమే కాకుండా అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.  ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కారును, దాని డ్రైవర్‌ ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్- సంతోష్ నగర్ పరిధిలోని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులోని స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకురావడానికి మొహియుద్దీన్ వెళ్లాడు. అతనితో పాటు మూడేళ్ల కుమారుడు ఇజ్ఞాన్ ఉద్దీన్‌ కూడా ఉన్నాడు. పార్సెల్ తీసుకుని హోటల్ నుంచి బయటకు వస్తుండగా హోటల్ ముందు రోడ్డుపై అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చింది. ఇజ్ఞాన్ ఉద్దీన్‌ ను బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. అయితే తీవ్రంగా గాయపడిన ఇజ్ఞాన్ ఉద్దీన్‌ ను తండ్రి సమీపంలోని షాలిని ఆసుపత్రికి తరలించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే సంతోష్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కారును గుర్తించారు. అయితే ప్రస్తుతం కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని పేర్కొన్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ