మీడియా సంస్థలను "ఫేక్ న్యూస్", "కేన్సర్"గా ట్రూత్ లో అభివర్ణించిన డోనాల్డ్ ట్రంప్‌ :

Monday, September 21, 2026

"cancer" on Truth Social banned from the White House CNN Donald Trump describes media outlets as "fake news" international MSNBC Politico

t f B! P L

మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తనపై విమర్శాత్మక కథనాలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఆరోపించారు. వాటిని "ఫేక్ న్యూస్", "కేన్సర్"గా అభివర్ణించారు. "ఇది మన జాతీయ భద్రతకు ముప్పు అని, వెంటనే ఆపాలి" అని పేర్కొన్నారు. అంతకుముందు మూడు మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి అనుమతించకుండా నిషేధించారు. తమ జర్నలిస్టుల ప్రెస్‌ క్రెడెన్షియల్స్‌ను ఎలాంటి ముందస్తు నోటీసు లేదా తగిన ప్రక్రియ లేకుండానే రద్దు చేశారని సీఎన్ఎన్, ఎంఎస్ నౌ,పొలిటికో ఆరోపించాయి. వైట్‌హౌస్‌ నిషేధాన్ని ప్రకటించిన సమయంలో ట్రంప్‌ తన ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడిపై మీడియా సంస్థలు "ఫిక్షన్‌, అబద్ధాలు" ప్రచురించకూడదని అన్నారు. తన దృష్టిలో తప్పుడు వార్తలను ప్రచురించే సంస్థలకు వైట్‌హౌస్‌ యాక్సెస్‌ ఉండకూడదని వ్యాఖ్యానించారు. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ,పొలిటికోలను ఎందుకు నిషేధించారని ప్రశ్నించగా, "వారు ఫేక్ న్యూస్" అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. అయితే ఈ మూడు సంస్థలను ఎంచుకోవడానికి కారణమైన నిర్దిష్ట కథనం లేదా ఘటనను వైట్‌హౌస్‌ బహిరంగంగా వెల్లడించలేదు. భవిష్యత్తులో మరిన్ని మీడియా సంస్థలపై కూడా ఇలాంటి ఆంక్షలు ఉండొచ్చని ట్రంప్‌ హెచ్చరించారు. తమపై విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ ఫెడరల్ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు మూడు సంస్థలు సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్‌ ద్వారా కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కులను కాపాడుకునేందుకే ఈ న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపాయి. ప్రభుత్వం.. ఏం రాయాలో, ఏం ప్రచురించాలో నిర్ణయించే పరిస్థితి ఉండకూడదని సంస్థలు పేర్కొన్నాయి. తమ కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకే జర్నలిస్టుల క్రెడెన్షియల్స్‌ను రద్దు చేశారని ఆరోపించాయి. వైట్‌హౌస్‌ నుంచి తమకు తిరిగి ప్రవేశం కల్పించేలా అత్యవసర న్యాయపరమైన జోక్యం కోరనున్నాయి. వారాంతంలో ఆంక్షలను అమలు చేశారు. సీఎన్ఎన్ కు చెందిన సీనియర్ వైట్‌హౌస్‌ రిపోర్టర్ బెట్సీ క్లెయిన్, ఎంఎస్ నౌ రిపోర్టర్ అకైలా గార్డ్నర్‌ వైట్‌హౌస్‌ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. పొలిటికో రిపోర్టర్ చెయెన్ హాస్లెట్‌ ప్రెస్‌ క్రెడెన్షియల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సంస్థలు తెలిపాయి. వైట్‌హౌస్‌లోకి ప్రవేశం నిరాకరించినప్పటికీ.. జర్నలిస్టులు బయట నుంచే తమ రిపోర్టింగ్‌ను కొనసాగించారు. సీఎన్ఎన్ కు సోమవారం వైట్‌హౌస్‌ టెలివిజన్‌ పూల్‌ బాధ్యత కూడా షెడ్యూల్‌ అయి ఉంది. అధ్యక్షుడి కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను ఒక బ్రాడ్‌కాస్టర్‌ సేకరించి ఇతర టీవీ నెట్‌వర్క్‌లకు అందించే విధానాన్నే టీవీ పూల్‌ అంటారు. అయితే సీఎన్ఎన్ కు బదులుగా మరో బ్యాకప్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వైట్‌హౌస్‌ ఆదివారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ కేసులో అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్‌, పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలకు సంబంధించిన డ్యూ ప్రాసెస్‌ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తమ రిపోర్టింగ్‌పై అసంతృప్తితోనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి. వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ కూడా ఈ నిషేధాన్ని విమర్శించింది. ఒక సంస్థను దాని కథనాల కారణంగా మినహాయించేందుకు ఉపయోగించే ప్రమాణాలు భవిష్యత్తులో ఇతర మీడియా సంస్థలకూ వర్తించే ప్రమాదం ఉందని అధ్యక్షురాలు జాక్వి హెన్రిచ్‌ పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు అధికారంలో ఉన్నవారిని స్వతంత్ర మీడియా ద్వారా ప్రశ్నించే అవకాశం ఉండాలని ఆమె అన్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ