రైలు ఆలస్యమైతే పరిహారం ఇవ్వాల్సిందే : వినియోగదారుల కమిషన్ తీర్పు

الثلاثاء، 22 سبتمبر 2026

Compensation Must Be Paid for Train Delays Consumer Commission Ruling indian railways Jharkhand national

t f B! P L

జార్ఖండ్‌లోని జిల్లా వినియోగదారుల కమిషన్ రైలు సర్వీసుల్లో నాణ్యతా లోపంతో ప్రయాణికులకు తీవ్ర అవాంతరాలు కలిగిస్తే భారతీయ రైల్వే భారీ పరిహారం చెల్లించక తప్పదని స్పష్టం చేసింది. నిర్ణీత సమయం కంటే దాదాపు 9 గంటలు ఆలస్యంగా నడిచినందుకు గాను బాధితుడికి రూ.35,000 పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఈ ఉత్తర్వులను అత్యంత కీలకమైన మైలురాయిగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. బాధితుడు సంజయ్ కుమార్ 2024 సెప్టెంబర్ 23న టాటానగర్ నుంచి సంబల్‌పూర్ వెళ్లేందుకు ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరికి స్లీపర్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:18 గంటలకు ప్రారంభం కావాల్సిన రైలు తీవ్ర జాప్యంతో బయలుదేరి ఏకంగా 8 గంటల 48 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. దీనివల్ల తనకు తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రూ.4.5 లక్షల పరిహారం కోరుతూ సంజయ్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై రైల్వే శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ అంశం రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుందని, కమిషన్‌కు విచారించే పరిధి లేదని వాదించింది. అయితే, సుప్రీంకోర్టు గత తీర్పును ఉటంకిస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ చీఫ్‌ సునీల్ కుమార్ సింగ్, సభ్యులు ప్రదీప్ కుమార్ మిశ్రా, సంజు షాహీలతో కూడిన ధర్మాసనం రైల్వే వాదనను తోసిపుచ్చింది. ప్రయాణికుల సమయం అత్యంత విలువైందని, రైలు ఆలస్యానికి తగిన సహేతుక కారణాలను, అది తమ నియంత్రణలో లేని పరిస్థితుల వల్లనే జరిగిందని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత రైల్వేదేనని కమిషన్ పేర్కొంది. సేవా లోపాన్ని నిరూపించడంలో రైల్వే విఫలమైందని స్పష్టం చేస్తూ బాధితుడికి మానసిక వేదనకు గాను రూ.30,000 పరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.5,000 కలిపి మొత్తం రూ.35,000ను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గడువు దాటితే 12 శాతం వార్షిక వడ్డీ వర్తిస్తుందని హెచ్చరించింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ