హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ తాను కోర్టుకు వెళ్లబోనని, ఎన్నికలు వచ్చినప్పుడు తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిశితంగా అంచనా వేస్తున్నానని తెలిపారు. తాజాగా చిట్‌చాట్‌లో భాగంగా దానం నాగేందర్ మాట్లాడుతూ 'ఉప ఎన్నిక వస్తే నేను కొట్లాడుతాను. నేను కోర్టుకు వెళ్ళను. కోర్టు ఆర్డర్ కాపీని చదువుతున్నాను. నేను పోరాటం చేయడానికి రెడీగా ఉన్నా. సమయం వచ్చినప్పుడు మీడియా ముందుకు వస్తాను. ప్రస్తుతం అన్ని రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నానని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని' అన్నారు. తీర్పు వచ్చేటప్పటికే అసెంబ్లీ నుంచి ఇంటికి వచ్చిన దానం రెండు గంటల పాటు లోపలే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయనను కలిశారు. మరోవైపు దానం నివాసానికి నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్దగా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక దానం అనర్హతపై బీఆర్‌ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చారు. బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.
కోర్టుకు వెళ్లను, ఎన్నికలు వచ్చినప్పుడు పోరాటం చేస్తా !
Saturday, September 19, 2026
hyderabad I am currently reading the court order copy I will not go to court; I will fight when the elections come Khairatabad MLA Danam Nagender telangana
No comments:
Post a Comment