ホーム
/
technology
/
ఏఐ ఆధారిత సేఫ్ నెట్‌వర్క్ సేవలను విస్తరిస్తున్న ఎయిర్‌టెల్
Saturday, September 26, 2026
Airtel Expands AI-Powered Safe Network Services business system has so far identified 98.4 billion spam calls and 4.4 billion spam messages technology
ఎయిర్‌టెల్ ఏఐ ఆధారిత సేఫ్ నెట్‌వర్క్ సేవలను విస్తరిస్తోంది కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వ్యవస్థ ఇప్పటివరకు 98.4 బిలియన్ స్పామ్ కాల్స్, 4.4 బిలియన్ స్పామ్ మెసేజ్‌లను గుర్తించింది. అలాగే ఎస్ఎంఎస్లు, మెసేజింగ్ యాప్స్, ఈమెయిల్స్, బ్రౌజర్ రీడైరెక్ట్‌ల ద్వారా వచ్చే 1.62 మిలియన్లకు పైగా మాలిషియస్ లింకులను బ్లాక్ చేసినట్లు తెలిపింది. అంతే కాకుండా ఓటీపీ మోసాలను గుర్తించేందుకు ఏఐ బేస్డ్ రక్షణ, నకిలీ కస్టమర్ కేర్ లేదా బ్యాంక్ కాల్స్‌ను గుర్తించడంలో సహాయపడే బిసినెస్ నేమ్ డిస్ప్లే వంటి ఫీచర్లను కూడా ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వీటి కోసం వినియోగదారులు ప్రత్యేకంగా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా నెట్‌వర్క్ స్థాయిలోనే రక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
No comments:
Post a Comment